Current Affairs Telugu Daily

యురేనియం వ్యతిరేక ఉద్యమాలు

*యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి.
యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓ వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పారీ్టలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు . తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) చేపడుతుంది. 
*నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
* ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతిం చాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది.
*యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యురేనియం శుద్ధికి కృష్ణా జలాలను వినియోగిస్తే మత్స్య సంపద  నాశనమవుతుందని పర్యావరణ వేత్తలంటున్నారు.
*నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12 వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
*సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని దాదాపు 18 గ్రామ పంచాయతీలు ప్రమాదంలో పడతాయి. కేంద్ర అణుశక్తి సంస్థ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆమ్రాబాద్, పదర మండలాల పరిధిలో దాదాపు 21 వేల ఎకరాలు భూమి కావాల్సి ఉంటుంది. అందులో 4 వేల బోర్లు వేయనున్నారు.


views: 597

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams