Current Affairs Telugu Daily

సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ నంబర్ అనుసంధానం 

*సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ నంబరును అనుసంధానం చేయడంపై కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)ని కోరింది. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ నంబరును అనుసంధానించడానికి సంబంధించిన ఒక వ్యాజ్యంపై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్రానికి నోటీసులిచ్చింది.
*ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందే వారి బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఆధార్‌ను అనుసంధానించే అవకాశం ఉన్నందున కొత్తగా సోషల్‌ మీడియా ఖాతాలకు లింక్‌ చేయడం కష్టం. 
*ఆధార్‌ చట్ట ప్రకారం భారత సంచిత నిధితో సంబంధం లేని విషయాలతో ఆధార్‌ నంబరును అనుసంధానించడం కుదరకపోవచ్చు. 
*2018   సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం, ఆధార్ అనేది కేవలం పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN), ఆదాయపు పన్ను చెల్లింపు లకు  తప్పనిసరి చేశారు. ఆధార్ సవరణ చట్టం 2019  ప్రకారం, బ్యాంకులు మరియు టెలికాం కంపెనీలు కస్టమర్ల  సమాచారం తెలుసుకోవడానికి ఆధార్ ను తీసుకోవచ్చు.  


views: 572

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams