Current Affairs Telugu Daily

కిసాన్ మన్ ధన్ యోజన

 సెప్టెంబర్ 12 వ తేదీన ప్రధాన మంత్రి మోడీ ఝార్ఖండ్ లో ని రాంచి లో కిసాన్ మన్ ధన్ యోజన (KMDY) పథకం ప్రారంభించనున్నారు.  ఈ పథకం ద్వారా ఐదు కోట్ల చిన్న మరియు మధ్యతరగతి రైతులకు 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత నెలకు 3000 అందిస్తారు. 
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలలో  రూ . 10,774 ఖర్చు చేయనుంది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు ఈ పథకానికి అప్లై చేసుకొని నెలవారి ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. . రైతులు ఈ పథకంలో చేరినప్పుడు ఉన్న వయస్సు ఆధారంగా నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లించడం ద్వారా పెన్షన్ పొందవచ్చు.
*ఈ పెన్షన్ స్కీంను ఎల్ఐసీ నిర్వహిస్తుంది. రైతులు ప్రతి నెల చెల్లించే సొమ్ముకు సమానంగా కేంద్రం కూడా జమ చేస్తుంది.
*అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు. పద్దెనిమిదేళ్ల వయస్సు నుంచి నలభై ఏళ్ల లోపు రైతులు, వారి జీవిత భాగస్వాములు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు.
*సభ్యులు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బును కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. రైతుల వయస్సు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ డబ్బుతో నెలనెలా రూ.3వేల రూపాయల పింఛన్ అందిస్తారు. సభ్యులుగా ఉన్న రైతులు 60 ఏళ్లు దాటిన తర్వాత మరణిస్తే అతని భార్యకు పింఛన్‌లో 50 శాతం సొమ్ము అందిస్తారు. రైతు, జీవిత భాగస్వామి లేదా నామినీ మరణిస్తే పేరుకుపోయిన మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తారు.
*ఈ స్కీంలో చేరాక, అరవై ఏళ్లకు ముందే మరణిస్తే ఆ సభ్యులు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా భాగస్వామికి లేదా నామినీకిగాని ఇస్తారు. సేవింగ్ బ్యాంక్ రేట్స్ వడ్డీ రేటు కట్టి ఇస్తారు. అయిదేళ్ల వరకు క్రమం తప్పకుండా చెల్లిస్తేనే, పింఛన్ పథకం నుంచి తప్పుకుంటే వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. పెన్షన్ కావాలంటే 60 ఏళ్ల వరకు తమ వంతు వాటా చెల్లించాలి.
* జార్ఖండ్ లో  ప్రధాని మోడీ 400  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలలు  6 నుండి 12 వ తరగతి చదివే గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. 


views: 683

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams