Current Affairs Telugu Daily

ఆభరణాల రంగం--ఆర్థిక మాంద్యం

*15% భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా
*970 కోట్ల డాలర్లు
*వేలాది స్వర్ణకారుల ఉపాధిపై అనిశ్చితి
*ఆభరణాల రంగాన్ని ఆదుకునేందుకు దిగుమతి బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని, జువెలరీ విక్రయాలపై జీఎ్‌సటీ భారాన్నీదించాలని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెల్లరీ దేశీయ సమాఖ్య డిమాండ్‌ చేస్తోంది. 
*ప్రభుత్వం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2019-20)కి ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.
*బంగారు నగల విక్రయాలపై జీఎ్‌సటీని 3 శాతం
*పన్నుల పెరుగుదల, బంగారం ధరలు పెరగడం వల్ల,డిమాండ్ తగ్గింది.  
* అంతర్జాతీయ ఆభరణాల వినియోగంలో భారత జెమ్స్‌ అండ్‌ జువెలరీ  ఇండస్ట్రీ వాటా 29 శాతం.
* 2018లో రూ.5.32 లక్షల కోట్ల స్థాయికి చేరిన మార్కెట్‌ సైజు 2025 నాటికి రూ.7.10 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. 3 లక్షలకు పైగా వర్తకులున్న ఈ రంగం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7 శాతం వాటా కలిగి ఉంది. 46.4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.
అసోసియేషన్ ప్రకారం చేపట్టవలసిన చర్యలు-
*బంగారంపై దిగుమతి సుంకాన్ని మళ్లీ 10 శాతానికి తగ్గించాలి
*జీఎ్‌సటీని ఒక శాతానికి కుదించాలి
*బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి
*బంగారాన్ని అసెట్‌ క్లాస్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లకూ నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపు పథకాన్ని ప్రవేశపెట్టాలి
*ప్రస్తుతం రూ.2 లక్షల విలువైన ఆభరణ కొనుగోళ్లకు పాన్‌ కార్డు వివరాలివ్వడం తప్పనిసరి. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. 


views: 576

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams