Current Affairs Telugu Daily

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌-తొలి వార్షికోత్సవం

ఐపీపీబీ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తొలి వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. 
*కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ --ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) కస్టమర్లు, ఖాతాల సంఖ్య ఐదు రెట్లు పెంచుకోవడం లక్ష్యం.డిజిటల్‌ పరివర్తనలో ఐపీపీబీని కీలక సాధనంగా చేయడం కోసం డిజిటల్‌ లావాదేవీలను పెంచుకోవాలని సూచించారు.
* కోటి మంది కస్టమర్ల మైలురాయిని దాటింది ,కేవలం ఏడాదిన్నర కాలంలో 30 కోట్లకు పైబడి జన్‌ధన్‌ ఖాతాలు ప్రారంభించింది ,ఐపీపీబీ 5 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సూచించింది. 
* తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆధార్‌ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థ (ఎఈపీఎస్‌) సేవలను కూడా ప్రారంభించారు. 
* ఏడాదిలో రూ.6 వేల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు సాధించిన ఐపీపీబీ వచ్చే ఏడాదికల్లా రూ.5 లక్షల కోట్ల విలువ గల లావాదేవీలు సాధించడం లక్ష్యం.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 440 స్కీమ్‌ల చెల్లింపులు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలోకి వచ్చాయి, ప్రస్తుతం 40 స్కీమ్‌ల సొమ్మునే ఐపీపీబీ బదిలీ చేస్తుంది.  
* ఐపీపీబీ ప్రారంభించిన ఏఈపీఎస్‌ (Aadhaar Enabled Payment System)బ్యాంకుల సర్వీసుల ద్వారా ఆధార్‌తో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాలున్న ఏ బ్యాంకు కస్టమర్లయినా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఏఈపీఎస్‌ అనుసంధానత ద్వారా వారు నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ వంటి కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. పేమెంట్ బ్యాంక్స్ ఓ రకమైన బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి.
రెగ్యులర్ బ్యాంకుల్లానే ఇవీ పనిచేస్తాయి... రూ.లక్ష వరకు నగదు బదిలీ చేసేందుకు కూడా వీలుంటుంది కానీ ఇక్కడ మాత్రం రుణం పొందేందుకు వీలుండదు. నగదు బదిలీతో పాటు, బిల్ పేమెంట్స్, మర్చంట్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. భారత్‌లో పేమెంట్ సేవలు ఆర్థిక వ్యవస్థలో భాగంగా నచికేత్ మోర్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు అయ్యాయి. బ్యాంకింగ్ గురించి పూర్తిగా తెలియని వారికోసం సాధారణ బ్యాంకింగ్ గురించి తెలియజెప్పేందుకు ఈ తరహా పేమెంట్ బ్యాంక్స్ ఏర్పాటు అయ్యాయి.


views: 586

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams