Current Affairs Telugu Daily

ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం

*ప్రపంచదేశాలన్నీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ)కి స్వస్తి పలకాలని ప్రధాని మోడీ యూఎన్‌సీసీడీ  సదస్సులో పేర్కొన్నారు. అలాగే బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి ప్రసంగించారు. 
*ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌సీసీడీ) కాప్‌14 సదస్సుకి ఈ సారి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది.
*ఈ సమావేశం ఎక్కడ  జరుగుతుంది- గ్రేటర్ నోయిడా
*ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
* ఒకసారి మాత్రమే వినియోగించాల్సిన ప్లాస్టిక్‌ను  వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో పూర్తిగా నిషేధించనున్నారు.
* 2015–17 మధ్య కాలంలో భారత్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగింది2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని  లక్ష్యం. భూముల్ని పునరుద్ధరించడానికి రిమోట్‌ సెన్సింగ్, స్పేస్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది.
* ఈ సదస్సు  సెప్టెంబర్ 2 నుండి 13వ తేదీ వరకు జరగనుంది.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(UNEP )  ప్రకారం 60 దేశాలు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్  వస్తువులపై నిషేధం విధించగా కేవలం 30 శాతం దేశాలు ఒకసారి వినియోగించే  ప్లాస్టిక్ పై నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం  5 ట్రిలియన్స్ ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు  అంటే ప్రతి నిమిషం పది మిలియన్ల ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తున్నారు.   
యూఎన్‌సీసీడీ--తీవ్రమైన కరువు, ఎడారీకరణ గల దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికా ఖండం దేశాలు  ఎడారీకరణ తగ్గించడానికి,కరువు ప్రభావాన్ని తగ్గించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి జాతీయ ప్రణాళికలను  దేశాలు రూపొందించుకునేలా అంతర్జాతీయ సహకారం అందిస్తుంది. 
*ప్రధాన కార్యాలయం- బూన్ , జర్మనీ


views: 599

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams