Current Affairs Telugu Daily

సాయుధ బలగాల శక్తి పెంపుదల

*సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్‌ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చనుంది. 
* ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్‌వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలు ఉండనున్నాయి.
*వాయుసేన(ఐఏఎఫ్‌) కోసం 110 మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేయనున్నారు.
*ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
*అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని–5’ భారత రక్షణ రంగంలో చేరనుంది. 


views: 578

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams