Current Affairs Telugu Daily

సురక్షితంగానే  విక్రమ్ ల్యాండర్

*చంద్రయాన్‌–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది.ల్యాండర్‌ ధ్వంసం కాలేదని వెల్లడించింది.
*విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కేంద్రంలోని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 
 చంద్రుడిని ఢీకొన్న విక్రమ్‌ ముక్కలు కాలేదు.ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్‌ ఉన్నట్లు గుర్తించారు.
* ‘చంద్ర కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌లోని కెమెరా పంపిన థర్మల్‌ ఛాయాచిత్రాలను బట్టి నిర్దేశిత ప్రదేశానికి అతి చేరువలోనే విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ అయినట్లు తెలుస్తోంది. సాఫీగా కాకుండా నిర్ణీత వేగం కన్నా ఎక్కువ వేగంగా కిందకు జారిపోయినా విక్రమ్‌ విరిగి ముక్కలు కాలేదు. వేగంగా దిగడానికి చంద్రుడిపై ఉన్న గురుత్వాకర్షణ ప్రభావం ఓ కారణం కావొచ్చు.
* ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్‌ ఉండగా, కమాండ్‌ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి.


views: 639



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams