Current Affairs Telugu Daily

తెలంగాణ బడ్జెట్ 2019-20

పథకాలకు కేటాయింపులు
-------------------------------------
* పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు 
* వ్యవసాయరంగానికి మాత్రం గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.3,340 కోట్ల మేర పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్య శాఖల నిధులు పెరిగాయి.సహకార రంగం కేటాయింపుల్లో మాత్రం సుమారు 15 కోట్ల మేర తగ్గించారు. రూ.1.46 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 11.4 శాతం 
*వ్యవసాయం, మార్కెటింగ్‌ రంగాలకు రూ.15,196 కోట్లు, సహకార రంగానికి రూ.92.66 కోట్లు, పశు సంవర్థక, మత్స్య శాఖలకు రూ.1,431.96 కోట్లు కేటాయించారు. జాతీయ ఆహార భద్రత మిషన్, వ్యవసాయ పారిశ్రామికీకరణ, పంట కాలనీల అభివృద్ధి, భూసార, జల సంరక్షణ, సూక్ష్మసేద్యం వంటి పలు పద్దులకు పూర్తిగా కోత విధించారు. 
*ప్రాథమిక రంగంలో రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధిస్తూ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 8.1 వృద్ధిరేటును సాధించింది.
*ప్రస్తుత బడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ.12 వేల కోట్లు, 50 లక్షల మంది రైతులకు లబ్ధి.
* రైతుబీమా పథకంలో బీమా ప్రీమియం కింద రూ.1,137 కోట్లు ప్రతిపాదించగా, 57 లక్షల మంది రైతులకు లబ్ధి.
* నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్‌ బిల్లుల కోసం రూ.8 వేల కోట్లు
 వైద్య రంగానికి
----------------------
గత ఏడాదితో పోలిస్తే 200 కోట్లు ఎక్కువ కేటాయింపులు .
*2018–19లో రూ.3,522 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,705 కోట్లను ప్రతిపాదించింది.
*ఆరోగ్య శ్రీ- 2018–19లో రూ.530 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.720 కోట్లను కేటాయించారు. 
*ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ--గతేడాది రూ.460 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.529 కోట్లకు పెంచారు. 
*వైద్యం, ప్రజారోగ్యానికి ఈ సారి రూ.340 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.ఐదు కోట్లు అధికం. 
*వైద్య విద్య, శిక్షణ, పరిశోధనకు రూ.111 కోట్లను ఇచ్చారు.  
*జాతీయ కుష్టు నివారణ పథకానికి రూ.2.32 కోట్లు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి రూ.2.52 కోట్లు, అంటువ్యాధి నియంత్రణ కార్యక్రమానికి రూ.6.29 లక్షలను కేటాయించారు.
*కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు -- గత బడ్జెట్‌లో రూ.1,216 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.766 కోట్లను మాత్రమే చూపింది( రూ.450 కోట్లు తగ్గించింది).
*ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియోపతి విభాగాలకు రూ.19 కోట్లు ఇచ్చింది. గతేడాది పోలిస్తే రూ.18 లక్షలు అధికంగా ఇచ్చింది. 
* ఔషధ నియంత్రణకు రూ.16.88 కోట్లను కేటాయించింది.
విద్యుత్ రంగం
--------------------
*2017–18లో రూ.3,728.25 కోట్లను వ్యవసాయ విద్యుత్‌ రాయితీలకు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.5,984 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్‌ మిల్లులకు విద్యుత్‌ రాయితీలను రూ.35 కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచింది. దీంతో మొత్తం విద్యుత్‌ రాయితీలు రూ.6,079 కోట్లకు పెరిగాయి.
*  గతేడాది విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.598.24 కోట్ల రుణాలు కేటాయించగా, ఈసారి రూ.197.02 కోట్లకు తగ్గించింది.
తెలంగాణ రాష్ట్ర అప్పులు
----------------------------------
 రూ.77,314 కోట్లను వివిధ కార్పొరేషన్ల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది.ఇందులో సాగునీటి శాఖ కోసం రూ.32,130 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.23,014 కోట్లు, ఇతర పథకాలకు రూ.22,170 కోట్ల రుణాలకు గ్యారంటీలు ఇచ్చింది. 
* 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.23,902 కోట్ల మూలధన వ్యయం జరగ్గా, అది 2018–19 సంవత్సరానికి రూ.33,369 కోట్ల మేర ఉందని అంచనా.  ఈసారి బడ్జెట్‌ అంచనాల్లోనే రూ.17,274 కోట్లను మూలధన వ్యయం కింద ప్రకటించారు.

రుణాలు
-----------
*బహిరంగ మార్కెట్‌లో రూ.1.63 లక్షల కోట్లకుపైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9,457 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి 12,391 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,813 కోట్లు సమీకరించింది. 
* 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 కోట్ల అప్పు ఉంటే 2019–20 నాటికి అది 2 లక్షల కోట్లకు పెరిగింది. గత నాలుగేళ్లలో రూ.74 వేల కోట్ల అప్పులు పెరిగాయి. 
వెనకబడిన వర్గాలకు
----------------------------

*2018–19 సంవత్సరంలో రూ.5,690.04 కోట్లుగా (బడ్జెట్‌ అంచనా) కేటాయించారు. 
*వార్షిక సంవత్సరం చివరినాటికి సవరించిన అంచనాగా రూ.5,311.44 కోట్లు ఖరారు చేశారు. 2019–20 సంవత్సరంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.4,528.01 కోట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.2,990.04 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే బీసీలకు కేటాయింపులు 43.70 శాతం తక్కువ. 
ఎంబీసీ కార్పొరేషన్‌కు
--------------------------------
* 2017–18 సంవత్సరంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 
*తొలి ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా,ఆ తర్వాత సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించగా... ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించింది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ 
-----------------------------------------
*కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు 2018–19 వార్షిక సంవత్సరంలో రూ.1,450.46 కోట్లు కేటాయించగా2019–20 వార్షిక సంవత్సరంలో కూడా ఇదే మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. షాదీ ముబారక్‌ పథకం కింద మాత్రం అదనంగా రూ.89.99 కోట్లు కేటాయించింది.
డబుల్ బెడ్ రూమ్  ఇల్లు ఇళ్ళు 
------------------------------------
*2018–19 బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.2,795.14 కేటాయించగా 2019–20లో కేవలం రూ.977.68 కోట్లు కేటాయించారు.

 పురపాలక శాఖకు
--------------------------
*2018–19 బడ్జెట్‌లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లను కేటాయించగా, 2019–20 వార్షిక బడ్జెట్‌లో రూ.1,791.94 కోట్లకు తగ్గించింది.  నిర్వహణ పద్దును సైతం రూ.2,570.46 కోట్ల నుంచి రూ.1,262.21 కోట్లకు తగ్గించింది . 
*పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.755.20 కోట్ల నుంచి రూ.521.73 కోట్లకు తగ్గించింది.
*మున్సిపల్‌ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.141.64 కోట్ల నుంచి రూ.75.47 కోట్లకు తగ్గించింది. 
ఆలయాలకు 
------------------
*యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లకు తగ్గించింది. 
*వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్ల నుంచి రూ.5 లక్షలకు తగ్గించింది. 
*ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు -గత సంవత్సరం రూ.50 కోట్లు.  ఈ సంవత్సరం ఎలాంటి కేటాయింపులు లేవు. 
* భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు ---గత సంవత్సరం రూ.100 కోట్లు.ఈ సంవత్సరం  ఎలాంటి కేటాయింపులు లేవు. 
హైదరాబాద్‌ నగరానికి
-------------------------------
*గత సంవత్సరం---మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి గతేడాది రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి రూ.566.02 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు.  ఏ సంవత్సరం ఎలాంటి కేటాయింపులు లేవు. 
*హెచ్‌ఎండీఏకు మూలధన రుణాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.10 లక్షలకు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు రూ.235 కోట్ల నుంచి రూ.10 లక్షలకు రుణాలను తగ్గించింది. 
 రూ.33 వేల కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది .
*అంతర్గత రుణం రూ.33,444 కోట్లు,ఇందులో ఓపెన్‌మార్కెట్‌ రుణాల కింద రూ.31 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.800 కోట్లు, ఇతర రుణాలు రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు.
*పోలీసుశాఖ
----------------
*2018–19లో రూ.1,143 కోట్లుగా ఉన్న ప్రగతిపద్దు 2019–20లో కేవలం రూ.167 కోట్లుగా ఉంది.రూ.4,297 కోట్ల మేరకు ఉన్న నిర్వహణ వ్యయాన్ని ఈసారి రూ.4,788 కోట్లకు పెంచారు.
*పారిశ్రామిక  రంగం--గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక రంగానికి  రూ.740.12 కోట్ల మేర కేటాయింపులు తగ్గించారు . 
బియ్యం సబ్సిడీకి
--------------------------
*ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 1432.40 కోట్లు కేటాయించారు.
*గత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ. 1,718.33 కోట్లు కాగా ఈసారి నిధుల్లో రూ. 285.93 కోట్ల కోత పడింది.
*లబ్ధిదారులు-2.80 లక్షల మంది 


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams