Current Affairs Telugu Daily

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌-- రాఫెల్‌ నాదల్‌ 

*యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిల్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ గెల్చుకున్నాడు. తుది పోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు.
*ఈ విజయంతో కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలిచినట్టు అయింది. 
*చాంపియన్‌ రాఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
*20 గ్రాండ్‌స్లామ్‌ టైటిట్స్‌తో రోజర్‌ ఫెదరర్‌.. నాదల్‌ కంటే ముందున్నాడు. మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు.
*30 ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రాఫెల్‌ నాదల్‌ రికార్డు సృష్టించాడు. 
*ఫెడరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రొడ్‌ లావెర్‌, కెన్‌ రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు. 33 ఏళ్ల నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. 
*కెరీర్‌లో 27వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ ఆడిన రాఫెల్‌ 19 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.


views: 628

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams