Current Affairs Telugu Daily

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌-- సెరెనాపై గెలుపు

*యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో కెనడియన్‌ బియాంక ఆండ్రిస్యూ (19) మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌, అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించింది.
*ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో బియాంక ఆండ్రిస్యూ 6-3, 7-5 తేడాతో సెరెనాపై గెలిచింది. 
*ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన తొలి కెనడియన్‌గా బియాంక ఆండ్రిస్యూ నిలిచింది.
* దాంతోపాటు పిన్న వయసులో (19 ఏళ్లు) గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన మహిళగా ఆమె రికార్టు సృష్టించింది.
*రూ. 27 కోట్ల 59 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
* గత రెండేళ్లలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొంనేందుకు కూడా ఆండ్రిస్యూ అర్హత సాధించక పోయింది.
*సెరెనా ఇప్పటివరకూ ఆమె ఆరు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచింది.గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది . 
*2014లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచారు సెరెనా.  ఆమె ఇప్పటివరకు 23 మరో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. మరో టైటిల్‌ గెలిస్తే.. అత్యధిక సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన మార్గరెట్‌ కోర్టు(24 గ్రాండ్‌ స్లామ్‌టైటిల్స్‌) ఆల్‌ టైమ్‌ రికార్డును సెరెనా సమం చేస్తారు.


views: 618

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams