Current Affairs Telugu Daily

అమ్మకాలు లేని ఆటో రంగం

*దేశీయ ఆటో పరిశ్రమ మరింత పడిపోయింది. పదవ నెలలో కూడా అమ్మకాలు భారీగా పడిపోయాయి. నెలవారీ ప్యాసింజర్‌ వాహనాలు,ఇతర కార్ల అమ్మకాలు ఆగస్టులో పడిపోయాయి.
* భారతీయ ఆటోమొటైల్‌ ఉత్పత్తుల అసోసియేన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం--1997-98 సంవత్సం నుంచి  డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద క్షీణత.
* ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 31.57 శాతం పడిపోయి ఆగస్టులో 196,524 యూనిట్లకు చేరుకున్నాయి.
*సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సమవారం విడుదల చేసిన గణాంకాలు  ప్రకారం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.
*వాహన కంపెనీలు ఇప్పటికే 15 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్షిప్‌లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు.
*భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత వారం హర్యానాలోని తన గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజులు నిలిపివేసింది.


views: 574

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams