Current Affairs Telugu Daily

అంధులు కరెన్సీ నోట్లను గుర్తించే మొబైల్‌ యాప్‌

*అంధులు కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించేందుకు వీలు కల్పించే మొబైల్‌ యాప్‌ను భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.దీనిని తయారు చేసేందుకు వెండార్‌ (డఫోడిల్‌ సాఫ్ట్‌వేర్‌)ను  ఆర్బీఐ ఎంపిక చేసింది . 
* ప్రస్తుతం రూ.10, 20, 50, 100, 200, 500, 2,000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నాయి.
*రూ.1 నోటును కేంద్రం జారీ చేస్తోంది.
*కొత్తగా వచ్చిన నోట్ల పరిమాణం తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని గుర్తించి లావాదేవీలు నిర్వహించడంలో అంధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేలా ఆర్‌బీఐ తీసుకురాబోయే మొబైల్‌ యాప్‌ సహాయపడుతుంది . 
నోట్లను  మొబైల్ కెమెరా ద్వారా ఫోటో తీసి  ఆడియో రూపంలో నోటు విలువను చెబుతుంది.  
దేశంలో దాదాపు 80 లక్షల మంది చూపు లేని వారు ఉన్నారు. 


views: 616

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams