Current Affairs Telugu Daily

తెలంగాణ నూతన  గవర్నర్, నూతన మంత్రులు

రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణంచేశారు. తమిళిసైతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు.
*కొత్త మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళిసై--
తొలిసారి ఇద్దరు మహిళలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లను తన కేబినెట్‌లోకి తీసుకున్నారు . 

.1.ఖమ్మం శాసనసభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌- రవాణా శాఖ(2014, 2018లో గెలుపు)
2.మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి-విద్యాశాఖ(గతంలో నిర్వహించిన పదవులు: గనులు,  హోంశాఖ మంత్రిగా పనిచేశారు)
3.సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు-ఆర్థిక శాఖ(2004లో వైఎస్‌ కేబినెట్‌లో యువజన సర్వీసుల మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాతే ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో సాగునీటి మంత్రిగా బాధ్యతలు)
4. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌- ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, మైనింగ్‌ శాఖలు(2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు )
5.కరీంనగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్‌- బీసీ సంక్షేమంతో, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ(2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం)
6.మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, పెద్దతండాకు చెందిన భూక్యా సత్యవతి రాథోడ్ -గిరిజన,స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి. 


views: 594

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams