Current Affairs Telugu Daily

గుజరాత్  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  నియామకం

* గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం విక్రమ్‌నాథ్‌ అలహాబాద్‌ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది.
*ఈ నియామకానికి కేంద్రం అనుమతించలేదు.
*జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 


views: 575

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams