Current Affairs Telugu Daily

దొరికిన విక్రమ్ జాడ

*భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ను గుర్తించింది. చంద్రుడిపై విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ జరిగి నట్టు తెలుస్తుంది  అంటే నిర్దేశిత ప్రాంతంలో మృదువుగా కాక, నిర్ణీత వేగం కన్నా ఎక్కువ వేగంతో కిందికి జారిపోవడం.
*చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్‌’కు సంబంధించిన థర్మల్‌ ఇమేజ్‌లను చిత్రీకరించింది.
* ల్యాండర్‌ లోపలే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఉంది.
*ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి.
* ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్‌–ల్యాండర్‌–రోవర్‌ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. 
*ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయి, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్‌ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం  చేస్తాయి.
* విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విక్రమ్‌ సజావుగా నాలుగు కాళ్లపై నిలిచినట్టుగా పడి ఉంటే సౌరఫలకాల సాయంతో విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. 
*నాసా ప్రశంసలు- ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ‘అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌–2ను స్వాగతిస్తున్నట్లు తెలిపింది.
 మన సౌరవ్యవస్థను మీతో కలిసి అన్వేషించే భవిష్యత్‌ అవకాశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం అని ట్వీట్ చేసింది. 
*చంద్రయాన్‌-3ను జాప్యం లేకుండా వేగవంతంగా ప్రారంభించాలని ఇస్రో భావిస్తుంది. జపాన్‌ దేశ సహకారంతో దీనికి రూపకల్పన చేయనున్నారు. ఒకవేళ ఉభయదేశాల మధ్య ఒప్పందం కుదిరితే.. 2024లో సంయుక్తంగానే చంద్రుడిపైకి సరికొత్త ఉపగ్రహాన్ని పంపే అవకాశం . 


views: 619

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams