Current Affairs Telugu Daily

పాక్‌లో పెట్టుబడులు

 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరతతో ఉన్న పాక్‌లో చైనా బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైతే 90 శాతం పాకిస్తానీ వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు ఎలాంటి సుంకాలు లేకుండా చైనాకు ఎగుమతి అవుతాయి. దీని వల్ల పాకిస్తాన్‌ ఎగుమతులు 500 మిలియన్‌ డాలర్లకు చేరుతాయి. 
*భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న చైనా... ఇలాంటి ఆర్థిక సాయాల వ్యూహాలు పన్నుతోంది.
*చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో... చైనా... ఓ ప్రాజెక్టును చేపట్టి... దాని కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో బలూచిస్తాన్‌లోని గ్వడార్ పోర్ట్ నుంచీ... చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ వరకూ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీని ద్వారా... మధ్య ఆసియా దేశాలతో తమ వాణిజ్యాన్ని భారీగా పెంచుకోవచ్చని చైనా భావిస్తోంది. ఇందులో పాకిస్థాన్‌ను పావుగా వాడుకుంటోంది.
*చైనా-పాకిస్థాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్... రెండో దశకు సంబంధించి అక్టోబర్‌లో రెండు దేశాలూ సంతకాలు చేసుకుంటాయి. ఆ తర్వాత... పాకిస్థాన్ ఎగుమతుల్లో 90 శాతం వస్తువులకు, సముద్ర ఆహారానికీ... విదేశీ కస్టమ్ డ్యూటీ ఉండదు. పాకిస్థాన్ ఎగుమతులు 50 కోట్ల డాలర్లకు చేరుకుంటాయి. దీని వల్ల పాక్‌లో చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది . 


views: 568

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams