Current Affairs Telugu Daily

 మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల రద్దు

*వ్యవ సాయ, మార్కెట్‌ కమిటీల పాలకవర్గాలు రద్దు అయ్యాయి. వాటి స్థానంలో పర్సన్‌ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 
*ఎన్‌టీఆర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (మిర్చియార్డు)తో సహా జిల్లాలోని సెలెక్షన్‌ గ్రేడ్‌ కమిటీలకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సీ రామాంజనేయులు చార్జ్‌ తీసుకుంటారు. 
*స్పెషల్‌ గ్రేడ్‌ కమిటీలకు మార్కెటింగ్‌ డీడీ, ఇతర కమిటీలకు ఏడీని ప్రభుత్వం నియ మించింది. గత ఏడాది అక్టోబరు నెలలో వ్యవసాయ, మార్కెట్‌ కమిటీలకు కొత్త పాల కవర్గాలు ఏర్పాటు అయ్యాయి.
*జిల్లాలో గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దుగ్గిరాల, తెనాలి, చిలక లూరిపేట, పొన్నూరు కమిటీలు సెలెక్షన్‌ గ్రేడ్‌గా ఉన్నాయి. అలానే స్పెషల్‌ గ్రేడ్‌గా తాడికొండ, క్రోసూరు, వినుకొండ, మాచర్ల, రొంపిచర్ల, బాపట్ల, రేపల్లె, నరసరావుపేట కమిటీలున్నాయి.
* గ్రేడ్‌-1, అంతకంటే తక్కువ స్థాయి హోదాలో మంగళగిరి, ఈపూరు, కూచినపూడి, వేమూరు, రాజుపాలెం, ఫిరంగిపురం కమిటీలున్నాయి. గుంటూరులోని ఏడు, కృష్ణా జిల్లాలో నాలుగు, పశ్చిమగోదావరిలో 10, ప్రకాశంలో ఒకటి, నెల్లూ రులో మూడు సెలెక్షన్‌గ్రేడ్‌ కమిటీలకు జేడీనే పర్సన్‌ ఇన్‌చార్జ్‌.గుంటూరులో 8, ప్రకాశంలో ఆరు, నెల్లూరులో ఒకటి కలిపి మొత్తం 40 కమిటీలకు జేడీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. 


views: 642

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams