Current Affairs Telugu Daily

 ‘దేవుడు లేడు’ అనొచ్చా?

*పిటీషన్--తమిళనాడులో అనేక చోట్ల నెలకొల్పిన పెరియార్‌ రామస్వామి విగ్రహాల కింద ‘దేవుడు లేడు’ అని చెక్కి ఉండడం తమ మనోభావాల్ని దెబ్బతీస్తోందని, దేవుడు సర్వాంతర్యామి అని భావించేవారంతా ఇబ్బందిగా ఫీలవుతున్నారని పేర్కొంటూ దైవనాయకం అనే వ్యక్తి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.    
*మద్రాస్‌ హైకోర్టు తీర్పు-- దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్టే.. దేవుడు లేడని చెప్పే హక్కూ ఉంటుంది. దీన్ని కాదనలేం.రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటనను అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు’’రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను ఎవరూ హరించలేరు, అని తీర్పుఇచ్చింది.
*పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.
*ఈయన నాస్తికవాది మరియు సంఘ సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీ లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. 
*ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ స్వాతంత్ర్యం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్నికులాలవారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. 1937 వ సంవత్సరంలో రాజాజీ నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపచేశాడు.
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని ద్రావిడర్ కళగం అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంతో విభేదించిన యమ్.జి.రామచంద్రన్ డి.యమ్.కె. నుండి విడిపోయి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. రామస్వామి 24 డిశంబర్ 1973 న కన్నుమూశారు.


views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams