Current Affairs Telugu Daily

అందీ అందని చందమామ

*చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు  సజావుగా సాగిన ప్రయాణం
*ఇక కొన్ని క్షణాల్లో చంద్రుడిని తాకుతుందనగా సిగ్నల్స్‌ అందలేదు 
*చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది.2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయి.
చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్‌ విక్రమ్‌,తర్వాత ఏం జరిగింది అనేది తెలియడంలేదు.
*2019 జూలై 22: మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌ 2ను జీఎస్‌ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. దీనిని 169.7కిలోమీటర్ల పెరీజీ, 45,475 కిలోమీటర్ల అపోజీ గల భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.
జూలై 24- ఆగస్టు 2: వివిధ దశల్లో చంద్రయాన్‌ భూకక్ష్య దూరాన్ని 4 సార్లు పెంచారు.
ఆగస్టు 4: చంద్రయాన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ భూమి ఫొటోను తీసి పంపించింది.
ఆగస్టు 6: ఐదోసారి భూకక్ష్య దూరాన్ని పెంచారు.
ఆగస్టు 14: చంద్రయాన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుడి బదిలీ కక్ష్యలోకి పంపించారు.
ఆగస్టు 20: చంద్రయాన్‌ను 114 కిలోమీటర్ల పెరీజీ, 18,072 అపోజీలో చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ఆగస్టు 21-సెప్టెంబరు 1: వివిధ దశల్లో చంద్రుడి కక్ష్య దూరాన్ని 5 సార్లు తగ్గించారు.
ఆగస్టు 22: చంద్రయాన్‌ జాబిల్లికి 2,650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఫొటో తీసి పంపించింది
సెప్టెంబరు 2: 96కిలోమీర్ల పెరీజీ, 125 కిలోమీటర్ల అపోజీ కక్ష్యలో విక్రమ్‌ ల్యాండర్‌ను ఆర్బిటార్‌ నుంచి వేరుచేశారు. ఆర్బిటార్‌ తన జీవిత కాలమంతా ఇదే కక్ష్యలో తిరుగుతుంది.
సెప్టెంబరు 3, 4: చంద్రుడి కక్ష్యను క్రమంగా తగ్గిస్తూ ల్యాండర్‌ను చంద్రుడికి చేరువగా తీసుకెళ్లారు.
సెప్టెంబరు7: విక్రమ్‌ ల్యాండింగ్‌పై సందిగ్ధం
దక్షిణ దృవం మీద ఎందుకు? ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో ఏ దేశ వ్యోమనౌకా దిగలేదు. చంద్రుడి ఉత్తర ధ్రువంతో పోలిస్తే.. దక్షిణ ధ్రువం ఎక్కువ కాలం నీడలో ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ 10 కోట్ల టన్నుల నీరు ఉండొచ్చని భావిస్తున్నారు.
*చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని క్రేటర్లలో వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి వెలుగు పడకపోవడం వల్ల సౌర వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ఆధారాలు అక్కడ పదిలంగా ఉండే అవకాశం ఉంది.
*నీడలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో హైడ్రోజన్‌, అమ్మోనియా, మిథేన్‌ మూలకాలు ఉండొచ్చని అంచనా.
*ఇక్కడ నీటి జాడలను గుర్తిస్తే.. భవిష్యత్‌లో మానవ సహిత యాత్రలకు అవకాశమేర్పడుతుంది. ఈ ప్రదేశం బేస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందనే భావన.

 


views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams