Current Affairs Telugu Daily

 అక్షరాలా ప్రజోద్యమం

*హాంకాంగ్‌ ఉద్యమకారుల ఆగ్రహానికి  చైనా తలొగ్గింది.నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు హాంకాంగ్‌ నగర చీఫ్‌ ఎగ్జి క్యూటివ్‌ కారీ లామ్‌ ప్రకటించారు.

  *నేపథ్యం- 1840లో హాంకాంగ్‌ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్‌ వలస పాలకులు ఆ తర్వాత 1898లో చైనాతో 99 ఏళ్ల లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్వల్పకాలం అది జపాన్‌ పాలన కింద ఉంది.లీజు పూర్తయ్యాక 1997 జూలై 1న హాంకాంగ్‌ను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ ఆ నగరానికి స్వయంప్రతిపత్తిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఆనాటి చైనా ఉపప్రధాని డెంగ్‌ జియావోపింగ్‌ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. 
‘ఒకే దేశం–రెండు వ్యవస్థల’ విధానాన్ని పాటిస్తా మని, ఆ నగరంపై తమ పెత్తనం రుద్దబోమని మాట ఇచ్చారు. విధానం కింద హాంకాంగ్‌ తన ఆర్థిక, వాణిజ్య విధానాలను తానే నిర్ణయించుకోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం, న్యాయవ్యవస్థ కూడా హాంకాంగ్‌వే కొనసాగాలి. కానీ ఆచరణలో ఇదంతా అమలు కాలేదు. 
*పాలన హాంకాంగ్‌దే అయినా, తాను నిర్ణయించిన వ్యక్తే దాని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయ్యేవిధంగా చైనా చర్యలు చేపట్టింది.హాంకాంగ్‌కి ఉన్న అధికారాలను తగ్గించింది.  
ఇటీవల చైనా చేపట్టిన చర్యలు, ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు
-------------------------------------------------------------------------
*పాలనా వ్యవస్థలోని చైనా వ్యతిరేకుల్ని అనర్హులుగా ప్రకటించడం, ఉద్యమాల్లో పాల్గొనేవారికి పోటీ చేసే హక్కును నిరాకరించడం, చైనా వ్యతిరేకు లుగా ముద్రపడినవారిని చైనాకు అపహరించుకుని తీసుకెళ్లడం వంటివి చైనా చేసింది. 
*వీటన్నిటికంటే ముఖ్యంగా  నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు ను చైనా ఇటీవల తీసుకువచ్చింది. 
నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు---ఇది చట్టంగా మారితే, ఎవ రినైనా, ఏ సాకుతోనైనా చైనాకు అప్పగించవచ్చు. ఏమాత్రం విశ్వసనీయతలేని న్యాయవ్యవస్థ రాజ్యమేలుతున్న చైనాలో నేరం రుజువైందన్న పేరిట ఎంత కఠిన శిక్షలైనా విధించే ప్రమాదం ఉంది. పైగా అది వెనకటి కాలంనుంచి వర్తిస్తుందన్న నిబంధన ఉండటంతో హాంకాంగ్‌ ప్రజల సహనం నశించింది.
* తొలుత ఇది కేవలం చిన్న పాటి నిరసనలకే పరిమితమైంది.జూన్‌ నాటికి పూర్తిస్థాయి మహోద్యమంగా మారింది. 
*2016 గణాంకాల ప్రకారం చైనాలోని 13,370 కోట్ల డాలర్ల  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 61 శాతం హాంకాంగ్‌ నగరంద్వారా  వచ్చాయి. వేరే దేశాల్లో చైనా పెట్టే పెట్టుబడుల్లో 60 శాతం హాంకాంగ్‌లోనే ఉన్నాయి. 

 


views: 611

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams