Current Affairs Telugu Daily

భువనేశ్వర్‌-కృష్ణరాజపురం హమ్‌సఫర్‌ వీక్లీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నడిచే నూతన హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22833/22834) వీక్లీ రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు 2017 జులై 13న ప్రారంభించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌ నుంచి కర్ణాటకలోని కృష్ణరాజపురం వరకు హమ్‌సఫర్‌  వీక్లి రైలు నడుస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలను కూడా సురేష్‌ ప్రభు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సమీకృత రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రైట్స్‌ (రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీసెస్‌)తో పరిశీలన చేయించామని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు చెప్పారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
views: 1177

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams