Current Affairs Telugu Daily

‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’

ల్యాండర్‌ ‘విక్రమ్‌’ చంద్రుడిపై పాదం మోపే ఘట్టానికి తెరలేవనుంది. చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ను సెప్టెంబర్ 5వ తేదీ నాటికి చంద్రుడికి 35 కి.మీ. దగ్గరగా, 101 కి.మీ. దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్‌ చంద్రుడికి 96 కి.మీ దగ్గరగా, 125 కి.మీ దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది.
*సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య  చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్‌ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌బీ) ద్వారా అన్వేషించనున్నారు.అక్కడ విక్రమ్‌ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. 
*ల్యాండర్‌ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు.  1.40 నుంచి 1.55 గంటల మధ్య... అంటే 15 నిమిషాలపాటు ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ జరగనుంది. అందుకే దీనిని ‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ గా పిలుస్తున్నారు.
*కొన్ని గంటల తరువాత  27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగి ఉండే ప్రజ్ఞాన్‌ రోవర్‌ వెలుపలికి వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్‌ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది. విక్రమ్‌ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు అందుతుంది.
*ఎందుకు ‘15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’?-- భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి (భూమితో పోలిస్తే చాలా తక్కువగా) ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్‌ ల్యాండర్‌.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండేందుకు విక్రమ్‌లోని డైరెక్షనల్‌ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ అది చంద్రుడిపై నెమ్మదిగా దిగేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారు. విక్రమ్‌ అలా నెమ్మదిగా దిగడానికి పావుగంట సమయం పడుతుంది. ఇలా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశాలు ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే


views: 572

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams