Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వివిధ నిర్ణయాలు 

*ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన ఇసుక విధానానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) చేపట్టనుంది.
*పర్యావరణ హితమైన కొత్త విధానం సెప్టెంబర్ 5 నుండి అమలులోకి రానుంది. 
*ధర తగ్గిస్తూ, పారదర్శకంగా నేరుగా వినియోగదారులకు ఇసుక చేరవేస్తారు . 
*ప్రస్తుతానికి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబర్ నాటికి 80 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక  ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు.10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు. పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యతను ఏపీఎండీసీకి అప్పగించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు క్యూబిక్‌ మీటరుకు రూ.60 చొప్పున ఏపీఎండీసీ రైతులకు చెల్లించనుంది. లోడింగ్, తవ్వకాల రూపంలో రైతులపై ఎలాంటి భారం ఉండదు. దీన్ని ఏపీఎండీసీనే భరిస్తుంది. 82 చోట్ల పట్టా భూములను ఎపీఎండీసీ గుర్తించింది. 100 రీచ్‌లను సిద్ధం చేసింది. 31 చోట్ల డీ సిల్టేషన్‌ చేపట్టనుంది. ఇసుక రవాణా చేసే  ప్రతి వాహనానికి జీపీఎస్‌ తప్పనిసరి. రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు, స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు వాహనాల్లో జీపీఎస్‌ ఉంటుంది. అనుమతి లేని వాహనాల్లో  ఇసుక రవాణా చేయకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధించారు. 

 ఆటో, టాక్సీవాలాలకు
-------------------------
*సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భార్య, భర్త ఇద్దరినీ ఒకే యూనిట్‌గా పరిగణించాలని, అదే కుటుంబంలో మేజర్‌ కుమారుడు లేదా కుమార్తె ఓనర్‌ కం డ్రైవర్లుగా ఉంటే వారిని వేరే యూనిట్‌గా పరిగణించాలని నిర్ణయించారు. 3.97 లక్షల మంది ఆటో, టాక్సీ వాలాలకు ఏడాదికి రూ.397. 93 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది.

‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’
------------------------
*శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’ను అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పథకం లబ్ధిదారులు దాదాపు 96,397 మంది.
*ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది. వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద ఎస్సీలకు ఇచ్చే నగదును రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఎస్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. వికలాంగులకు నగదు కానుకను రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎస్సీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు, ఎస్టీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 1.20 లక్షలు, బీసీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 70 వేలు చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు. 

ఆశా వర్కర్ల వేతనాలు పెంపు

-------------------------------

ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాలు
--------------------------------
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.2014 నుంచి 2019 వరకు పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.బంగారు పతకానికి రూ.5 లక్షలు, వెండి పతకానికి రూ.4 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు నగదు చొప్పున ప్రోత్సాహకాలు చెల్లిస్తారు.

డీఆర్డీఓకు 5 ఎకరాలు

------------------------
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం. అక్కడ రాకెట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది. 
నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్‌ కోసం 20.19 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు.

 


views: 631

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams