Current Affairs Telugu Daily

‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’ప్రతినిధులతో జగన్ భేటీ

*ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
*బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ ముఖ్యమంత్రిని కలిశారు .
*రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం పై చర్చ. 
*రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు .
*రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70 శాతాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
*రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
*‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’--బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి.షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది.


views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams