Current Affairs Telugu Daily

రక్షిత ప్రాంతంగా అస్సాం

*కారణం-అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ తుది జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌–ఎన్‌ఆర్‌సీ)పై వివాదం చెలరేగిన నేపథ్యంలో. అస్సాంలో ఇటీవల ఎఆర్‌సీని సవరించినప్పటికీ ఇంకా 19 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. 
*అస్సాంను కేంద్ర విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల పరిధిలో ‘ప్రొటెక్టెడ్‌ ఏరియా (రక్షిత ప్రాంతంగా)’ ప్రకటించారు. 
* తక్షణం విదేశీ జర్నలిస్టులను రాష్ట్రం వదిలేసి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ.అంటే,వారు రాష్ట్రంలో ఉండాలన్నా, రాష్ట్రంలో ఏ వార్తలు సేకరించాలన్నా ముందస్తుగా హోం శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
* అస్సాంలో ఎన్‌ఆర్‌సీ పట్ల కేంద్రం అనుసరిస్తోన్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు విమర్శించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు . 
*రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్‌ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా విదేశాంగ శాఖ లేదా హోం శాఖ అనుమతి తీసుకోవాలి.
*పాప్‌ (పీఏపీ–ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్‌)గానీ, రాప్‌ (ఆర్‌ఏపీ–రిస్ట్రిక్డెడ్‌ ఏరియా పర్మిట్‌)గానీ తాము జారీ చేయడం లేదు. 
* రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాలి. 
*  ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి కోరవచ్చు.ప్రస్తుతం కశ్మీర్‌లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి.


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams