Current Affairs Telugu Daily

దేశంలో  వృద్ధిరేటు తగ్గుదల- వివిధ రంగాల పరిస్థితి 

 క్రిసిల్‌ తన అంచనాను 6.3 శాతానికి తగ్గించింది. గతంలో ప్రకటించిన అంచనా 6.9 శాతం.ఏ రంగంలోనూ పరిస్థితులు సానుకూలంగా లేని నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధంలోనూ రికవరీ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 
*విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులు ఉపసంహరణ --బడ్జెట్‌లో సంపన్నులపై ఆదాయపు పన్ను సర్‌చార్జిని పెంచడం వల్ల . 
*వాహనాల తయారీ రంగం లో సమస్యలు --2020 నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు అమలుపరచాలన్న నిర్ణయం,కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు 
*సిమెంట్‌, ఉక్కు డిమాండు గణనీయంగా  పడిపోనుంది.  
జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు జూన్‌ త్రైమాసికంలో 25 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5 శాతానికి క్షీణించింది.
*ఆదాయాల్లో క్షీణత, వ్యయాల పెరుగుదల, వివిధ విభాగాల్లో నెలకొన్న లోపాల వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం.
*ఎగుమతుల రంగంలో వృద్ధి 10.6 శాతం నుంచి 5.7 శాతానికి  తగ్గింది, ప్రభుత్వ వినియోగం 13.1 శాతం నుంచి 8.8 శాతానికి తగ్గింది.
*ఈ ఏడాది సిమెంట్‌ డిమాండు సగానికి సగం తగ్గుతుందని క్రిసిల్‌ రీసెర్చ్‌ అంచనా. (కారణాలు-- ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, లిక్విడిటీ కొరత)
* ఇంటర్నెట్‌ ఎకానమీ--2017 మార్చిలో బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కిప్షన్లు వార్షిక ప్రాతిపదికన 84.6 శాతం పెరిగాయి. ఆ తర్వాత నుంచి వృద్ధి సగానికి పైగా తగ్గింది.
 *గత ఏడాదిలో దేశీయ ఈ-కామర్స్‌, ఇంటర్నెట్‌ కంపెనీలు ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ ఫండ్ల నుంచి 700 కోట్ల డాలర్ల మేర నిధులు సేకరించగలిగాయి. కానీ ఈ రంగాల కంపెనీల్లోకి నిధుల ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 
* ఇండియా రేటింగ్స్‌ (ఇండ్‌రా) అంచనా-ఉక్కు డిమాండ్‌లో వృద్ధి 4 శాతాన్ని మించకపోవచ్చు.


views: 613



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams