Current Affairs Telugu Daily

తూర్పుదేశాల ఆర్థికసదస్సు,భారత్ రష్యా  20 వ వార్షిక సదస్సు--విశేషాలు 

*రష్యా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తూర్పుదేశాల ఆర్థికసదస్సు’కు మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే భారత్‌-రష్యా 20వ వార్షిక సదస్సు లో పాల్గొన్నారు. 
ముఖ్యమైన అంశాలు- 
*భారత్‌-రష్యా 20వ వార్షిక సదస్సు లో పాల్గొన్నారు
రక్షణ సహకారంలో 2020 వరకు రూపొందించిన ప్రణాళికను మరోదశాబ్దం పొడగింపు 
*వాణిజ్యం, అంతరిక్షం, చమురు, సహజవాయువు, అణు ఇంధనం, సముద్ర మార్గంలో రవాణా వంటి కీలక రంగాల్లో మరింతగా సహకారం . 
(15 ఒప్పందాలపై సంతకాలు 
*రష్యాలోని వ్లదివోస్తాక్‌ నుంచి నేరుగా చెన్నైకి సముద్ర మార్గంలో రవాణా ప్రారంభించాలని ప్రతిపాదన
*ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఐదేళ్లలో 3000 కోట్ల డాలర్లకు చేర్చాలని నిర్ణయం.(ప్రస్తుతం భారత్‌–రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్‌ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ–పుతిన్‌ నిర్ణయం)
*‘ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.
* భారత్‌–యూరేసియన్‌ ఎకనమిక్‌ యూనియన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు రష్యా కృషి. 
* కుడంకుళంలో నిర్మించే మరో 4 అణు రియాక్టర్లపై సమీక్ష
* ‘గగన్‌యాన్‌’ కోసం భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా అంగీకారం. 
*‘ఉగ్రవాదంపై పోరు’లో ద్వంద్వ ప్రమాణాలు పాటించే దేశాలపై అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు
*వచ్చేఏడాది మాస్కోలో జరిగే 75వ ‘విజయోత్సవ’ వేడుకలకు మోదీని పుతిన్‌ ఆహ్వానించారు. 

 


views: 581

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams