Current Affairs Telugu Daily

చంద్రుడికి చేరువగా విక్రమ్ లాండర్ 


*మూడవ  ఘట్టం విజయవంతం-విక్రమ్‌ ల్యాండర్‌ను చందమామకు మరింత దగ్గరగా చేర్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు.
*దీనికోసం ల్యాండర్‌లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్లపాటు మండించారు.
* ప్రస్తుతం ల్యాండర్‌ చంద్రుడికి దగ్గరగా 35 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 101 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తోంది.
*సెప్టెంబర్ 7వ  తేదీన అర్థరాత్రి ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు.  
* ల్యాండర్‌ తలుపులు తెరుచుకుని రోవర్‌(ప్రగ్యాన్‌) చంద్రుడి మీదకు దిగి 14 రోజులపాటు తిరిగి వివిధ పరిశోధనలు చేసి సమాచారాన్ని సేకరించి భూ నియంత్రిత కేంద్రానికి పంపిస్తుంది. 
*ల్యాండర్‌ను వదిలిపెట్టిన ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. 
*చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర.

  


views: 598

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams