సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ హాలీ ల్యాబ్స్‌ను ఆక్వి-హైరింగ్ ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కొత్త యూజర్లకి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు హాలీ ల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడనుంది.
- గూగుల్ భారత్‌లో ఏదైనా సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.
- ఏదైనా కంపెనీ అందించే ఉత్పత్తులు, సర్వీసుల కన్నా.. అందులోని సిబ్బంది కోసమే కొనుగోలు చేయడాన్ని ఆక్వి-హైరింగ్ అంటారు
- గూగుల్ ఇటీవలి కాలంలో కంపెనీ కొనుగోలు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది.
views: 997