Current Affairs Telugu Daily

అమెరికా పై చైనా ఫిర్యాదు

*చైనా ఫిర్యాదు కి గల కారణం--125 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పతులపై  15 శాతం సుంకాలను అమెరికా పెంచింది. చైనా ఉత్పత్తులైన చెప్పులు, స్మార్ట్ వాచ్‌లు, టీవీలు వంటి వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలు పెంచింది.
*ఇటీవల ఒప్పందం ఒసాకా వేదికగా చేసుకున్న ఒప్పందం(ఇరు దేశాలు పరస్పరం పన్నులు పెంచరాదు) ఉల్లంఘన  వల్ల చైనా ఫిర్యాదు చేసింది.
అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి ఒసాకా వేదికగా  తాత్కాలికంగా తెరపడింది.
ఒసాకా కిముందు-అమెరికా–చైనాల మధ్య వాణిజ్య లోటు-- 539 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు.దీనిని తగ్గించేందుకు అమెరికా ప్రయత్నించింది.250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచింది.చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది.కానీ ఒసాకా సమావేశంలో వాణిజ్య వల్ల నష్టం అని రాజీ కి వచ్చాయి.కానీ అమెరికా ఇటీవలి చర్యలపై WTO  కి చైనా ఫిర్యాదు చేసింది. 
*G20 SUMMIT -ఒసాకా,జపాన్ లో జరిగింది. ఈ సమావేశంలో అమెరికా,చైనా సమావేశమయ్యారు.
అమెరికా, చైనా యొక్క  $300bn విలువైన దిగుమతులపై సుంకాలు విధించము అని ప్రకటించింది.
*WTO--ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO ) అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు సరళీకృతం చేయడానికి దాని స్థాపకులచే రూపొందించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ 1947లోని ప్రారంభమైన సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందానికి (GATT) బదులుగా అధికారికంగా మారాకేష్ ఒప్పందాన్ని1995 జనవరి 1లో ప్రారంభించింది.
*ప్రపంచ వాణిజ్య సంస్థ పాల్గొనే సంస్థల మధ్య వాణిజ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది; వాణిజ్య ఒప్పందాలను చర్చించడానికి మరియు నిర్మించడానికి ఒక ప్రణాళికను మరియు సభ్య ప్రభుత్వాల యొక్క ప్రతినిధులు మరియు వారి చట్టసభలచే సంతకం చేసిన WTO ఒప్పందాలకు పాల్గొనేవారు కట్టుబడి ఉండేలా చూడటానికి ఒక వివాద పరిష్కార విధానాన్ని అందిస్తుంది.
*WTO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెంట్రీ విలియమ్ రాపార్డ్‌లో ఉంది


views: 597

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams