Current Affairs Telugu Daily

ఆర్బిటర్‌ నుంచి వేరైనా విక్రమ్‌ ల్యాండర్ 

*చంద్రయాన్‌-2 ప్రయోగం కీలక దశ విజయవంతమైంది.సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్‌ ల్యాండర్‌ చేరుకోనుంది.నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూకక్ష్యలో పరిభ్రమించి చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన  తరువాత నాలుగుసార్లు దాని కక్ష్యని శాస్త్రవేత్తలు తగించారు. ఐదోసారి తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్ వేరు చేసారు. 

*సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్‌ ల్యాండర్‌ చేరుకోనుంది.

*చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర.
*ఆర్బిటరు-ఆర్బిటరు ఇటు భూమిపై ఉన్న ఇస్రో వారి డీప్ స్పేస్ నెట్‌వర్కు తోను, చంద్రుడిపై దిగే ల్యాండరు తోనూ సంపర్కంలో ఉంటుంది ల్యాండరు ఆర్బిటరు నుండి విడివడే ముందు, దీనిలోని హై రిజల్యూషన్ కెమెరా ల్యాండరు దిగే ప్రదేశాన్ని హై రిజల్యూషన్ పరిశీలనలు చేస్తుంది.
*ల్యాండరు-దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ అని పేరు పెట్టారు.ఆర్బిటరు నుండి విడిపోయాక, విక్రమ్ తన 800 న్యూటన్ల ద్రవ ఇంధన ఇంజన్లను వాడి 30 x 100 కి.మీ. చంద్ర కక్ష్యకు దిగుతుంది. 


views: 621

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams