Current Affairs Telugu Daily

ప్రపంచంలో అత్యంత భద్రమైన నగరంగా టోక్యో 
* ప్రపంచంలో అత్యంత భద్రమైన నగరంగా టోక్యో నిలిచింది. 
* రెండు, మూడు స్థానాలను వరుసగా సింగపూర్‌, ఒసాకలు దక్కించుకున్నాయి. 
* మన దేశ రాజధాని దిల్లీ 52వ స్థానంతో సరిపెట్టుకోగా, వాణిజ్య రాజధాని ముంబయి మాత్రం 45వ స్థానంలో నిలిచింది. 
*‘ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ సంస్థ ఐదు ఖండాలకు చెందిన 60 నగరాల్లోని పరిస్థితులను మదింపు చేసి, ఈ ర్యాంకులను కేటాయించింది. 
* యాంగూన్‌ (మయన్మార్‌), కరాచీ (పాకిస్థాన్‌), ఢాకా (బంగ్లాదేశ్‌)లు వరుసగా చివరి మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. 
* డిజిటల్‌, మౌలిక వసతులు, ఆరోగ్య, వ్యక్తిగత భద్రత తదితర అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించారు.

views: 624

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams