Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు
*  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34కి పెంచిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది.
*  ఈ జాబితాలో గతంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి, ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌తోపాటు, పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ మురారి, రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ ఉన్నారు.
*  ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితోపాటు 30 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో సేవలందిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సంఖ్యను 34కి పెంచడంతో నలుగురు కొత్తవారిని నియమించడం అనివార్యమైంది.

views: 614

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams