Current Affairs Telugu Daily

ఆక్వాఅక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన హెచ్‌ఐసీసీలో ప్రారంభం
* మాదాపూర్ హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన ప్రారంభమైంది. 
* ఈ ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 
* సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. 
* ఈ సదస్సులో భారత్‌ సహా ఆసియా దేశాల నుంచి ప్రముఖ మత్స్య, వ్యాపార, పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో సుమారు 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. 
* తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తెరాస ఎంపీలు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, బండప్రకాశ్‌ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

views: 593

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams