Current Affairs Telugu Daily

అమెజాన్‌ అడవుల పరిరక్షణకు రూ.35 కోట్ల విరాళం లియోనార్డో డికాప్రియో
*  ప్రపంచ ఊపిరితిత్తులుగా పిలిచే అమెజాన్‌ అడవులు ప్రపంచంలోనే అతి పొడవైన రైయిన్‌ ఫారెస్ట్‌ అయిన అమెజాన్‌ అడవుల్లో  కార్చిచ్చు రగులుకుంది.
* గత రెండు వారాలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి యంత్రాంగం సాయశక్తులా కృషి చేస్తోంది.
*  ప్రతీ ఏటా ఈ అడవుల్లో వేల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు సంభవించటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* ఇప్పటికే అమెజాన్‌ను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణకు నడుం బిగించాయి.
* తాజాగా ఈ కార్యక్రమానికి తనవంతు సాయం అందించడానికి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో ముందుకు వచ్చారు. 
* అమెజాన్‌లో తరుచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు మరికొంత మందితో కలిసి రక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
*  అందుకోసం 5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 35 కోట్లు) రూపాయలను తన సేవా సంస్థద్వారా అందించనున్నట్టుగా ప్రకటించారు.

views: 712Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams