Current Affairs Telugu Daily

నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట లో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్
* దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్‌ని నిర్మించారు.
*  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ ‘వీ’ సెల్యూలాయిడ్‌ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు.
*‘సాహో’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ ఆరంభం కానుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్‌లో నిర్మించారు.
* ఇందులొ ఒక థియేటర్‌లో మాత్రం భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
*  ప్రపంచస్థాయిలో తీసుకుంటే ఇది మూడో భారీ స్క్రీన్‌ నిర్మించారు.
* ఆసియా ఖండంలో కూడా ఇదే మొదటి స్క్రీన్‌ అని సమాచారం. 106 అడుగులు వెడల్పు, 94 అడుగులు నిలువు స్క్రీన్‌ ఏర్పాటుతో పాటు  670 సీట్లు కెపాసిటీతో త్రీడీ సౌండ్‌ సిస్టమ్‌తో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. 
* మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు. సుమారు 7 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ గ్రూప్‌ థియేటర్స్‌ను నిర్మించారు.

views: 698

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams