Current Affairs Telugu Daily

ఏపీ భవన్‌ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా అరవింద్‌ 
* ఏపీ భవన్‌ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా సీనియర్‌ జర్నలిస్ట్‌ అరవింద్‌ యాదవ్‌ నియామకం అయ్యారు.
* మీడియా రంగంలో 24 ఏళ్లుగా విశేష సేవలందించిన అరవింద్‌ యాదవ్‌ ఇక మీదట ఏపీ భవన్‌ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. 
* ఆయన తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ మీడియా సంస్థలలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 
* జాతీయ మీడియా సంస్థలు ఆజ్‌ తక్‌, ఐబిఎన్‌ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా పని చేశారు.
*  టీవీ9, సాక్షి, యువర్‌ స్టోరీ మీడియాల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. అరవింద్‌ పలు హిందీ పుస్తకాలను రచించారు.

views: 649

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams