Current Affairs Telugu Daily

కొలీజియం సిఫారసును తిరస్కరించిన కేంద్రం
* మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అఖిల్‌ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. 
* గుజరాత్‌ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న అఖిల్‌ ఖురేషి పదోన్నతి విషయమై కొలీజియం మే 10న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
*  ఈ విషయంపై  స్పందించిన కేంద్రం కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. 
* ఈ నేపథ్యంలో గుజరాత్‌ హైకోర్టు అడ్వకేట్ల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
*  కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అఖిల్‌ ఖురేషి నియామకాన్ని అడ్డుకుంటోందని పిటిషన్‌లో న్యాయవాదులు ఆరోపించారు. 
* ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ విచారణ చేపట్టింది. 
* ఈ విషయంలో కేంద్రం, కొలీజియం మధ్య చర్చలు జరిగిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొంది.
*  ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపింది.
*  నిబంధనల ప్రకారం కొలీజియం రెండోసారి గనుక అఖిల్‌ ఖురేషి పేరును ప్రతిపాదించినట్లైతే కేంద్రం తప్పనిసరిగా ఆయన నియామకాన్ని ఆమోదించాల్సిందే.
*  ఇక గతేడాది ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పదోన్నతి విషయమై కేంద్రం, కొలీజియంల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. * సుప్రీంకోర్టు జడ్జిగా జోసెఫ్‌ పేరును కొలీజియం ప్రతిపాదించిగా కేరళ నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో తగిన ప్రాతినిథ్యం ఉన్నందు వల్ల ఆయన పేరును పునఃసమీక్షించాలని కేంద్రం కోరింది. 
* అయితే మరోసారి కొలీజియం ఆయన పేరునే సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఇందుకు అంగీకరించిన కేంద్రం మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్‌ వినీత్‌ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును నోటిఫికేషన్‌లో పేర్కొంది.
*  కేంద్రం కావాలనే జోసెఫ్ సీనియారిటీని తగ్గించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. 
*  సీనియారిటీ ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం లభిస్తుంది.

views: 631

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams