Current Affairs Telugu Daily

అఫ్గానిస్తాన్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌ సీఈఓగా కలీం ఫలాహి 
* అఫ్గానిస్తాన్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా హైదరాబాద్‌ నివాసి హఫీజ్‌ సయ్యద్‌ మూసా కలీం ఫలాహి ఎంపికయ్యారు. 
* జమాతే ఇస్లామి హింద్‌ పూర్వ కార్యదర్శిగా ఉన్న మౌలానా సయ్యద్‌ యూసఫ్‌ కుమారుడైన మూసా కలీంకు ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 
* గతంలో ఖతర్‌, దుబాయ్‌, నూర్‌ ఇస్లామిక్‌ బ్యాంకుల్లో అత్యున్నత హోదాల్లో ఈయన విధులు నిర్వహించారు.
*  దుబాయ్‌, నూర్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌ సంస్థల్లో 11 ఏళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 
* ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ రంగాల్లో ఆర్థిక నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు.
*  ప్రస్తుతం ఈ బ్యాంక్‌ అఫ్గానిస్తాన్‌ దేశవ్యాప్తంగా 58 శాఖల్లో లావాదేవీలు జరుపుతోంది.

views: 570

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams