Current Affairs Telugu Daily

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ప్రణాళికలు
* హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రంతో కూడిన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ముందడుగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 
* ఈ ప్రాంతంలో చైనాను సమతౌల్యం చేస్తూ, త్రైపాక్షికంగా ముందుకు సాగాలని భావిస్తున్నాయి. 
* ఈ నేపథ్యంలో మూడు దేశాల సమావేశం ఫ్రాన్స్‌ 2019లో  జరుగనుంది.
*  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన చర్చల్లో సురక్షిత స్వేచ్ఛాయుత నేవిగేషన్‌, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిరతను కాపాడటం వంటివే అజెండాగా నిలిచాయి. 
*  ఇరుదేశాలు సముద్రయాన నిఘా కోసం ఉమ్మడిగా ఉపగ్రహాల్ని రూపొందాలని నిర్ణయించాయి

views: 547

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams