Current Affairs Telugu Daily

పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ గౌర్‌
* ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 
* సెప్టెంబరు 23న ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. 
* ఈ నెల 23న పదవీ విరమణ పొందడానికి 48 గంటల ముందే చిదంబరం బెయిల్‌ పిటిషన్లను గౌర్‌ తిరస్కరించారు.
*  ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన సునీల్ గౌర్ సెప్టెంబర్ 23న బాధ్యతలు తీసుకోనున్నారు.
* ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఏప్రిల్ 2008లోజస్టిస్‌ సునీల్‌ గౌర్‌ నియమించబడ్డారు. ఆ తర్వాత ఏప్రిల్ 2012లో శాశ్వత జడ్జీగా నియామకమయ్యారు.
*  మూడు దశబ్దాలుగా పనిచేసిన ఆయన చాలా హై ప్రొఫైల్ కేసులను విజయవంతంగా పూర్తి చేశారు. 
* అవినీతి కేసులు, మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషిపై ఉన్న మనీలాండరింగ్ కేసును ఆయనే విచారించారు. 
* ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) కేసును కూడా ఆయన విచారించారు.
*  హైకోర్టు న్యాయమూర్తిగా రాకముందు సివిల్ అండ్ క్రిమినల్ కేసులు, ఢిల్లీ హైయ్యర్ జూడీషియల్ సర్వీస్, సంచలనంగా మారిన శివానీ భట్నాగర్ హత్య కేసు విచారణను కూడా ఆయన చేశారు.
* ఢిల్లీ మీడియేషన్ సెంటర్, తిస్ హజారీ కోర్టు, కర్కరర్డూమా కోర్టుల్లో ఇంఛార్జీ న్యాయమూర్తిగా పనిచేశారు.

views: 595

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams