Current Affairs Telugu Daily

వెన్నెముక శస్త్రచికిత్స కోసం రోబో
* వెన్నెముక శస్త్రచికిత్స కోసం  ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ‘స్పైన్‌ సర్జరీ రోబో’ను తయారు చేశారు. 
* దీని ద్వారా తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా చికిత్స చేయవచ్చని వారు తెలిపారు. 
* వెన్నెముక శస్త్రచికిత్సలకు సంబంధించి ఇండియాలో ఇదే మొట్టమొదటి రోబోటిక్‌ విధానం. 
* సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే దీనిలో రోగికి నొప్పి తక్కువ ఉంటుందని, ఇన్ఫెక్షన్‌లు కలుగవని చెప్పారు. 
* ఉచ్ఛతార్‌ ఆవిష్కార్‌ యోజనలో భాగంగా ఈ ప్రాజెక్టుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులను సమకూర్చింది.

views: 646

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams