Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ లో ఆస్ట్రా మైక్రో–రఫేల్‌ తయారీ కేంద్రం
*  హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రొడక్టస్‌ (ఏఎంపీఎల్‌), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్‌ అడ్వాన్డ్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఆర్‌ఏడీఎస్‌ఎల్‌) కలిసి ఆస్ట్రా రఫేల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ (ఏఆర్‌సీ) సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. 
* ఈ ఏఆర్‌సీ డిఫెన్స్‌ కమ్యూనికేషన్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.  ముఖ్యంగా ఇండియన్‌ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది.
*  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఏఆర్‌సీ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ సెంటర్‌ను  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి  ప్రారంభించారు. 
* ఈ ఏఆర్‌సీ కేంద్రంలో అత్యాధునిక మిలటరీ గ్రేడ్‌ ఎస్‌డీఆర్‌ (సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియో) తయారీ చేస్తారు. 
* ఎస్‌డీఆర్‌ ఉత్పత్తుల తయారీ తొలి ప్రైవేట్‌ కంపెనీ ఈ ఏఆర్‌సీ. తొలి దశలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఆధారిత రేడియోల తయారీతో ప్రారంభమై తర్వాత రక్షణ సమాచార మార్పిడి కోసం వివిధ రకాల ఉత్పత్తులను రఫేల్‌ అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి చేస్తుంది.
* ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్, సిగ్నల్‌ ఇంటెలిజెంట్‌ వ్యవస్థలో కూడా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది.
* ఏఆర్‌సీ సెంటర్‌లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి.  
* ఇప్పటికే రఫేల్‌ అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ కల్యాణి గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌గా హైదరాబాద్‌లో కల్యాణి రఫేల్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ను (కేఆర్‌ఏఎస్‌) ఏర్పాటు చేసింది.
* దీనికి భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) నుంచి 100 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ లభించింది. 
* వెయ్యి యూనిట్ల బరాక్‌–8 ఎంఆర్‌ శామ్‌ క్షిపణి కిట్స్‌ను సరఫరా చేయాల్సి ఉంది.

views: 598

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams