Current Affairs Telugu Daily

20 బ్రాండ్స్‌కు ప్రచార ప్రాతినిధ్యం వహిస్తున్న పీవీ సింధు 
* ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ప్రతి సంవత్సరం ‘ఫోర్బ్స్‌’ ప్రపంచ వ్యాప్తంగా ఓ లిస్ట్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. 
* లిస్ట్‌లో అత్యంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్‌లే అధికం. 
* ఆ క్రికెటర్‌ల జాబితాలో బ్యాడ్మింటన్‌ దిగ్గజం,  హైదరాబాదీ పీవీ సింధు చేరడం విశేషం.
* ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ అత్యంత ఆదాయం పొందుతూ ఉమెన్‌ కేటగిరిలో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది.
* 2019 జనవరిలో విడుదల చేసిన లిస్ట్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ ‘మెడిసన్‌ కీస్‌’తో పాటు ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు 13వ స్థానంలో ఉండటంగమనార్హం.
*  విరాట్‌ కోహ్లీ తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. 
* దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు  రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు. 
* చైనాకు చెందిన ‘లీ నీన్గ్‌’(స్పోర్ట్స్‌ మెటీరియల్‌) సంస్థతో పీవీ.సింధు.  రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. 
* మన దేశంలో ఆ సంస్థకు చెందిన ప్రకటనలు అన్నింటిలో పీవీ సింధునే కనిపించనుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థతో 2023 వరకు కుదుర్చుకోవడం జరిగింది. 
* దీంతో పాటు ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ‘మంత్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జీఎస్‌టీ, జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్, బ్రిడ్జ్‌స్టోన్‌ టైర్స్, మూవ్‌ పెయిన్‌ రిలీఫ్‌ అయింట్‌మెంట్, స్పోర్ట్స్‌ ఎనర్జీ డ్రింక్‌ గట్రోడ్, వైజాగ్‌ స్టీల్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ సెక్యూరిటీ ఫోర్స్, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్, హర్మన్‌ ఇంటర్నేషనల్‌ ఫర్‌ జీబీఎల్‌ ఎండూరెన్స్‌ ఇయర్‌ఫోన్స్, పానసోనిక్‌ బ్యాటరీస్, ఎపిస్‌ హనీ, ఓజాస్విత (శ్రీశ్రీ ఆయుర్వేద), యోనెక్స్, స్ట్రేఫీ, ఫ్లిప్‌కార్ట్, బూస్ట్‌’ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సింధు అంబాసిడర్‌గా ఉన్నారు.

views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams