Current Affairs Telugu Daily

సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆర్టికల్‌ 370’
* జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు  విచారణ చేపట్టింది. 
* ఈ అంశాలకు సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలవగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది.
*  ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. 
* అక్టోబరు మొదటివారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించారు.
* జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
* దానికి పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది అంతేగాక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 
* అయితే ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కశ్మీర్‌ వ్యాప్తంగా ఆంక్షలు విధించింది.
*  మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖ రాజకీయ నాయకులను గృహనిర్బంధం చేసింది.
*  రాజకీయ ప్రముఖులెవరూ కశ్మీర్‌ రాకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. 
*  వీటన్నింటినీ సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

views: 623

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams