Current Affairs Telugu Daily

ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త రమేష్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు
*  జాతీయ సేవా పథకం రాష్ట్ర సమన్వయకర్త కె.రమేష్‌రెడ్డి రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు.
*  2009 నుంచి 2018 వరకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా పని చేసిన ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
* ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాల నిర్వహణ, బాల్య వివాహల నియంత్రణపై అవగాహన కల్పించడం, విస్తృతంగా మొక్కలు నాటించడం, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించడం, బడి బయట పిల్లలకు విద్యపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై కృషి చేయడంతో అవార్డుకు ఎంపిక చేశారు.
* సెప్టెంబరు 9న జాతీయ సేవా పథకం దినోత్సవం రోజు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా రమేష్‌రెడ్డి ఈ అవార్డును అందుకోనున్నట్లు వెల్లడించారు.
* రమేష్‌రెడ్డి గతంలోనూ రెండు సార్లు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

views: 600

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams