Current Affairs Telugu Daily

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ
* జమ్మూ-కశ్మీర్‌లో అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
* ఇందులో భాగంగా 106కుపైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు, వివిధ పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనుంది.
* జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్పు చేసింది .
* వచ్చే నెల 31 నుంచి ఆ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. 
* ఈ సంధికాలంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర చట్టాలు అమల్లో ఉంటాయి. 
* అక్టోబర్‌ 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి మారేందుకు వీలుగా వందల కోట్ల రూపాయలతో కూడిన ఒక ప్యాకేజీ రూపకల్పనలో కేంద్రం నిమగ్నమైంది .
* గతవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కార్మిక, విద్యుత్‌, పునరుత్పాదక ఇంధనం, మానవ వనరుల అభివృద్ధి తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు.
*  ఈ సందర్భంగా జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాజెక్టులపై మదింపు జరిపారు.
*  అక్కడ కేంద్ర చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన నిధులపై విశ్లేషణ జరిపారు. 
*  జమ్మూ-కశ్మీర్‌ కు కొన్ని ప్రతిపాదనలివీ..
* జమ్మూ-కశ్మీర్‌లోని ఈఎస్‌ఐ చందాదారులకు ఆరోగ్య సేవలు అందించడానికి అక్కడ కొత్తగా  ఒక ఆసుపత్రిని నిర్మించాలని కార్మిక శాఖ ప్రతిపాదించింది.
* విద్యా హక్కు చట్టం అమలు చేయడానికి కేంద్రం కోట్ల రూపాయలు అందించనుంది.
* రాష్ట్రంలోని ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు, రాయతీలను అందించడానికి వీలుగా ఆధార్‌ చట్టం-2016ను కేంద్రం అమలు చేయనుంది.

views: 614

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams