Current Affairs Telugu Daily

‘అంబేడ్కర్‌ హౌస్‌’ ఫై వాదనలు వినిపించనున్న భారత్‌
*  భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఒకప్పుడు లండన్‌లో కొద్దికాలం పాటు నివసించిన ఇల్లు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.
*  ఆయన జ్ఞాపకంగా ఆ ఇంటిని మ్యూజియంగా మార్చడంతో సందర్శకుల సందడితో ఇబ్బందిగా ఉందంటూ ఇరుగుపొరుగున ఉన్న ఇద్దరు సంబంధిత ‘కామ్‌డెన్‌’ కౌన్సిల్‌కు 2018 జనవరిలో ఫిర్యాదు చేశారు. 
* మ్యూజియం నడపడానికి అనుమతి లేదని కౌన్సిల్‌ చెప్పింది. దీంతో 2018 ఫిబ్రవరిలో మహారాష్ట్ర సర్కారు మ్యూజియం నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
* అదే ఏడాది 2018  అక్టోబరులో ‘కామ్‌డెన్‌ కౌన్సిల్‌’ మహారాష్ట్ర అభ్యర్థనను తిరస్కరించింది.
*  దానిపై మహారాష్ట్ర సర్కారు మళ్లీ అపీలు చేసుకుంది.  ఆ క్రమంలో మూసివేతకు ముందడుగేసిన కౌన్సిల్‌ చర్యను భారత ప్రభుత్వం సవాలు చేసింది. 
* దీంతో, సెప్టెంబరు 24న బహిరంగ విచారణ జరపాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో మ్యూజియంను కొనసాగించే దిశగా ‘కౌన్సిల్‌’ ముందు వాదనలు వినిపించేందుకు పేరొందిన న్యాయ నిపుణులిద్దరిని మహారాష్ట్ర సర్కారు  నియమించింది.
*  తమ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు  ప్రముఖ న్యాయసేవల సంస్థ ‘సింఘానియా అండ్‌ కంపెనీ’ని నియమించుకుంది.  
* లండన్‌లోని భారత హై కమిషన్‌ ద్వారా వాదనలు వినిపించే ప్రత్యేక బృందంలో సదరు న్యాయనిపుణులిద్దరు కూడా ఉంటారు. 
* ‘అంబేడ్కర్‌ హౌస్‌’గా పేరొందిన ఈ ఇల్లు సంపన్నులు అధికంగా ఉండే ‘ప్రిమ్‌రోజ్‌ హిల్‌’ ప్రాంతంలో ఉంది.
*  లండన్‌స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకునే రోజుల్లో  అంబేడ్కర్‌ 1921-22లో ఈ ఇంట్లో నివసించారు. 
* ఆ మహానుభావుడి జ్ఞాపకార్థం ఈ ఇంటిని ఓ మ్యూజియంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్ర సర్కారు సంకల్పించింది.
*  దానిని 2015లో కొనుగోలు చేసి చక్కగా తీర్చిదిద్దింది. ప్రధాని మోదీ దీనికి ప్రారంభోత్సవం చేశారు.

views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams