Current Affairs Telugu Daily

జీ7కు ప్రత్యేక ఆహ్వానితుడిగా మోదీ
* ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మెక్రాన్‌ వ్యక్తిగత ఆహ్వానంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటున్నారు. 
* జీ7 సదస్సు జరుగుతున్న బియరిజ్‌(ఫ్రాన్స్‌)కు చేరుకున్నారు. 
* బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో భేటీ అయ్యారు. 
* జీ7 సదస్సులో పర్యావరణం, డిజిటల్‌ రూపాంతరీకరణ అంశాలపై మోదీ ప్రసంగించనున్నారు.
*  ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో వేర్వేరుగా భేటీ కానున్నారు. 
* కశ్మీర్‌లో పరిస్థితి, వాణిజ్యం తదితర అంశాలపై ట్రంప్‌తో చర్చించే అవకాశం ఉంది. కాగా, రష్యాను తిరిగి తమతో కలుపుకోవడానికి జీ7 దేశాల నేతలు మొగ్గు చూపుతున్నట్టు దౌత్య వర్గాలు తెలిపాయి. 
* జీ7లో బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా ఉన్నాయి. ఈ గ్రూపు నుంచి 2014లో రష్యాను బహిష్కరించడంతో జీ8 కాస్త జీ7గా మారింది.

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams